Manohar On New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని.. ఇప్పటికే ఈ ప్రక్రియపై కసరత్తు జరుగుతోందన్నారు. కొత్త జంటలకు మంత్రి శుభవార్త చెప్పారు. కొత్తగా వివాహం చేసుకున్నవారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి మనోహర్ ప్రకటించారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.