ఏపీలో మరో బైపాస్ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. నెల్లూరు జిల్లా కావలిలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కావలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే దుత్తలూరు కావలి రోడ్డు పనులు, రామాయపట్నం పోర్టు నుంచి 16వ జాతీయ రహదారి వరకూ రోడ్డు విస్తరణ గురించి కూడా చర్చించారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వేమిరెడ్డి ట్వీట్ చేశారు.