ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవుల తరఫున పోరాడటం కోసం, వారికి అండగా నిలబడటం కోసం ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల వర్ధంతి రోజునే ‘భరోసా’ పార్టీ ఆవిర్భవించింది. కడప నగరానికి చెందిన అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే తాను పాదయాత్ర చేస్తున్నానని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని అభినవ్ దర్శన్ ప్రకటించారు.