విశాఖ వాసులకు ట్రాఫిక్ కష్టాలు వీడటం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆఫీసులు, కార్యాలయాలకు వెళ్లేవారితో పాటుగా విద్యార్థులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే విశాఖలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆనందపురం- అనకాపల్లి ఆరు వరుసల రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టులో చాలావరకు పనులు పూర్తయ్యాయి. అయితే అధికారులు ఇంకా దీనిని డీ నోటిఫై చేయకపోవటంతో.. భారీ వాహనాలు విశాఖ నగరంలోకి వస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని స్థానికులు వాపోతున్నారు.