ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్లో వేగం పెరిగింది. 2026 నాటికి పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అదనంగా 500 ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని జీఎంఆర్ సంస్థ కోరింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేయగా.. సోమవారం మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు 500 ఎకరాలు కేటాయించేందుకు మంత్రుల కమిటీ ఆమోదం తెలిపింది.