ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. సీఎం చంద్రబాబు ఆమోదం.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఇవే..

9 months ago 23
ఏపీలో కొత్తగా మరో మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు. అనంతరం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మదనపల్లె, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అలాగే అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Read Entire Article