Andhra Pradesh Mps Request On New Railway Lines: ఏపీలోని రైల్వే సమస్యలపై టీడీప, జనసేన, బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో చర్చించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్లమెంటు రైల్వే స్థాయీ సంఘం ఛైర్మన్ సీఎం రమేష్‌ల ఆధ్వర్యంలో ఎంపీలు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన రైల్వే సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.