Podili First Train: ఏపీలో కొత్త రైలు మార్గం పనులు మరింత వేగవంతం అయ్యాయి.. నడికుడి-శ్రీకాళహస్తి రైలుమార్గం పిడుగురాళ్ల నుంచి వినుగొండ, దర్శి, పొదిలి మీదుగా రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి వరకు సుమారుగా 309 కి.మీ కొత్త రైల్వేలైన్ పనులు జరుగుతున్నాయి. దర్శి వరకు ట్రాక్ నిర్మాణం పూర్తయింది.. కనిగిరి, పామూరు మండలాల పరిధిలో వంతెనల నిర్మాణం జరిగింది. త్వరలోనే పొదిలి నుంచి కనిగిరి వరకు పనులు వేగవంతం అయ్యాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో కొంతమేర నిధులు కేటాయించడంతో తిరిగి పనులు వేగవంతమయ్యాయి.