పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ పాల్గొనాలని చంద్రబాబు సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కొల్లేరు సరస్సు సమస్యలపై చంద్రబాబు నాయుడు.. సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే కోటి మొక్కలు నాటాలని సూచించారు.