ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవనున్నాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ.. ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.