ఆంధ్రప్రదేశ్ లో మరో ఐదు రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు. SC వర్గీకరణ ప్రక్రియ ముగిసిన తర్వాతే DSC ప్రక్రియకు వెళ్లాలని నిర్ణయించినందున నోటిఫికేషన్ ఆలస్యమైందని తెలియజేశారు. తాజాగా ఎస్సీ కమిషన్ నివేదికపై క్యాబినెట్ ఆమోదం తెలిపిందని.. రాబోయే రెండు రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేస్తామని.. మరో 5 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందన్నారు మంత్రి నారా లోకేశ్.