ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ అధికారిపై అధికార కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్రంగా కొట్టారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్‌ను కొడుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను వైసీపీ నేతలు షేర్ చేస్తూ.. కూటమి ప్రభుత్వంలో నేతలు రెచ్చిపోయి పోలీసులపైనే దాడి చేస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇంతకీ ఆ వీడియో ఎక్కడిది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.