, Andhra Pradesh Dwcra Women Petrol Bunks Setup: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త తెలిపింది. ఇకపై మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు కూడా నడుస్తాయి. రాష్ట్రంలో తొలిసారిగా 25 జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికోసం మెప్మా ద్వారా రుణాలు, స్థలం, సహాయం అందిస్తారు. త్వరలోనే నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు కూడా రానున్నాయి!