Chandrababu Pension To Parents Lost Children: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని చంద్రబాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనర్హులైన పెన్షన్ లబ్ధిదారులను గుర్తించాలని.. మూడు నెలల్లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని కలెక్టర్లను ఆదేశించారు. అయితే, ఏరివేత తర్వాత కూడా అనర్హులైన పెన్షనర్లు దొరికితే కలెక్టర్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.