ACA International Cricket Stadium Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాభివృద్ధిపై దృష్టి సారించింది. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పెదలంక, చినలంక గ్రామాల్లో స్థలాలను పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ సహకారం అందించనుంది. దాదాపు 1.25 లక్షల మంది కూర్చునే సామర్థ్యంతో స్టేడియం నిర్మించాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. క్రీడా నగరం కోసం 2 వేల ఎకరాల భూమి అవసరమని భావిస్తున్నారు. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ లక్ష్మీశ్‌తో కమిటీని ఏర్పాటు చేశారు.