Amaravati Indias Biggest Railway Station: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ ప్లాన్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిని ఆధునిక సౌకర్యాలతో నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. అమరావతి రైల్వేస్టేషన్‌ను దేశంలో అత్యంత ఆధునికంగా నిర్మించనున్నారు. రెండో దశలో 56.53 కి.మీ. రైల్వేలైన్ నిర్మాణం చేపట్టనున్నారు. రైల్వేశాఖ వచ్చే రెండు నెలల్లో టెండర్లకు ఆహ్వానిస్తుంది. 2024 జూన్ తర్వాత పనులు మొదలవుతాయి.