Andhra Pradesh 10th Class Students Mid Day Meal In Holidays: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సెలవు రోజుల్లోనూ పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర విద్యాశాఖాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో పదిలో మంచి ఫలితాల కోసం ఎస్సీఈఆర్టీ వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.