Thamballapalle Honor Killing: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో పరువు హత్య కలకలంరేపుతోంది. ఓ మైనర్ బాలిక గత నెలలో అదృశ్యం కాగా.. తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వెతికి తీసుకొచ్చారు. ఇంతలో ఆ బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.. బంధువులు, పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని కాల్చేయడంతో పరువు హత్యగా అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ మేరకు ఘటనపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.