Andhra Pradesh Assembly And Lok Sabha Seats: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కేంద్రం 2029 ఎన్నికల నాటికి సీట్ల సంఖ్యను 50శాతం పెంచే అవకాశం ఉందంటున్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ సీట్లు పెరిగితే ఏపీలో అసెంబ్లీ స్థానాలు 263, లోక్‌సభ స్థానాలు 38కి పెరిగే అవకాశం ఉందంటున్నారు.