ఏపీలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తారా.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్

11 months ago 27
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయడాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. పేదల సొంతింటి కలను నాశనం చేయడమేనని ఆరోపించారు. గతంలో తాము 31.19 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. వాటి కోసం దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. తాము చేపట్టిన ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఆపేశారని.. కోర్టుల్లో కేసులు పెట్టించారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే న్యాయ పోరాటంతో పాటు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Read Entire Article