Chandrababu In Collectors Conference: ఏపీ విజన్ డాక్యుమెంట్‌ను అక్టోబర్ 2న విడుదల చేస్తామన్నారు చంద్రబాబు. కలెక్టర్‌లు ఆఫీసులో మాత్రమే కాకుండా కచ్చితంగా ఫీల్డ్ విజిట్ కూడా చేయాలని సూచించారు. క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలని.. గ్రామంలోకి వెళితే పెద్దపెద్ద సభలు వద్దని, తాను కూడా త్వరలో ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. కనీస అవసరాలు అందరికి అందిచే విషయంలో ఓ స్పష్టత రావాలని.. హెడ్ క్వార్టర్‌కు రోడ్లు, కనెక్టివిటీ, పోర్టుల వృద్ది చేయాలని, వాటితోపాటు టూరిజానికి కూడా ప్రయారిటీ ఇవ్వాలని కలెక్టర్లకు సూచనలు చేశఆరు.