AP Govt Removes School Bathroom Photos Upload App: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్లకు పెద్ద బాధ తప్పిపోయింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో బాత్ రూముల ఫోటోలు తీసి అప్లోడ్ చేసే యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. బాత్రూముల శుభ్రతపై ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు గత ప్రభుత్వం అప్పగించింది. ఈ నిర్ణయాన్ని టీచర్లు వ్యతిరేకించినా.. ప్రభుత్వం యాప్‌ను తొలగించలేదు. కూటమి ప్రభుత్వం ఈ బాధ్యతలు నుంచి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.