AP Municipal Teachers Promotions 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ టీచర్లకు తీపికబురు చెప్పింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక పాఠశాలల్లో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా SGT పోస్టులకు అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్ల లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని.. శనివారం సాయంత్రం లోపు ఒకవేళ ఏవైనా అభ్యంతరాలను తెలియజేయాలని సూచించారు.