ఏపీలో బర్డ్ ప్లూ వైరస్ కలకలం రేపుతోంది. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసింది. ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్నారు. అటువంటి వెహికల్స్‌కు రాష్ట్రంలో ఎంట్రీ లేదని అధికారులు వెల్లడించారు. పౌల్ట్రీ ఫాం రైతులకు కూడా వైరస్‌పై అవగాహన కల్పించాలని పశుసంవర్థకశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.