ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు చోట్ల బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సుమారుగా రూ.5,200 కోట్ల వ్యయంతో.. వేయి మెగావాట్ల సామర్థ్యంతో ఈ బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్లాంట్ల ఏర్పాటు కోసం కుప్పం, తూర్పు గోదావరి, వైఎస్ఆర్ జిల్లా మైలవరం, కర్నూలు జిల్లా గని ప్రాంతాలను ప్రతిపాదించినట్లు తెలిసింది. కేంద్ర సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సహకారంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.