Andhra Pradesh Capital Land Values: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 1 నుంచి ఛార్జీలు పెరుగతాయని.. కొన్ని చోట్ల తగ్గిస్తే.. మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఛార్జీలు పెరిగినా సరే అమరావతిలో మాత్రం పెంచడం లేదన్నారు. గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలతో ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయని.. వాటని పరిష్కరించే పనిలో ఉన్నామన్నారు.