ఏపీలో జాతీయ రహదారుల విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలుచోట్ల విస్తరణ పనులు మొదలయ్యాయి. అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి-544డీని విస్తరించాలని గతంలో నిర్ణయించారు. రెండు ప్యాకేజీలలో నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ప్రతిపాదించారు. అందులో భాగంగా బుగ్గ- గిద్దలూరు మధ్య 135 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఈ పనులకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ తాజాగా ఆమోదం తెలిపింది.