Andhra Pradesh National Highway 544D Expansion: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం జాతీయ రహదారుల పనులకు ఊతం ఇచ్చింది. రాయలసీమ ప్రాంతానికి అమరావతికి మధ్య రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గుంటూరు-కర్నూలు జాతీయ రహదారి 544డి పనులు వేగవంతం చేశారు. నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ రహదారి అందుబాటులోకి రానుంది. దీనితో రాయలసీమ ప్రాంత ప్రజలకు అమరావతికి ప్రయాణం సులభం కానుంది.