Srikakulam 326A Highway Road Over Bridge: శ్రీకాకుళం జిల్లాలో తిలారు రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కళింగపట్నం-పాతపట్నం జాతీయ రహదారిలో రూ.42 కోట్లతో నిర్మించిన ఈ వంతెన ద్వారా ఒడిశాకు వెళ్లడం సులభమవుతుంది. రైల్వే గేటు వల్ల గంటల తరబడి ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయి. అత్యవసర పరిస్థితుల్లో సైతం వాహనాలు నిలిచిపోయే ఇబ్బందులు ఇక ఉండవు అంటున్నారు స్థానికులు. త్వరలోనే ప్రజలకు ఈ వంతెన అందుబాటులోకి రానుంది.