Perecherla Mangalagiri Railway Line: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ పెంచేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గుంటూరు ప్రాంతంలో రైళ్ల రద్దీని తగ్గించేందుకు పేరేచర్ల-మంగళగిరి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నారు. దాదాపు రూ.2 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన సర్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ కొత్త మార్గంలో వస్తే ప్రయాణికులకు, సరుకు రవాణాకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.