Ongole To Kurnool National Highway Four Lines Expansion: ప్రకాశం జిల్లా ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఒంగోలు నుండి బేస్తవారిపేట వరకు 113 కిలోమీటర్ల మేర రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. రాయలసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యం మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సంతనూతలపాడు, పొదిలి వద్ద బైపాస్‌లు నిర్మించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. త్వరలోనే డీపీఆర్ సిద్ధం కానుంది.