Banaganapalli Pyapili Highway Expansion: రాయలసీమలో రోడ్ల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. బనగానపల్లి-ప్యాపిలి మధ్య 52 కిలోమీటర్ల మేర రోడ్డును రెండు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ పనులు చేపట్టనున్నారు. డ్రోన్ సర్వే ద్వారా మ్యాప్ తయారీ జరుగుతోంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే 20 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా అమరావతికి కనెక్టివిటీ కూడా పెరుగుతుందని అధికారులు తెలిపారు.