Bheemunipatnam Narsipatnam State Highway: ఏపీ ప్రభుత్వం మరో స్టేట్ హైవేకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో ఆగిపోయిన రోడ్డుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. రూ.480 కోట్లతో రెండు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు త్వరలోనే టెండర్లను పిలవాలని నిర్ణయించింది. మరో మూడు నెలల్లో టెండర్లు ఆహ్వానించి.. వ్యయంలో 20 శాతం కేంద్రం, 20 శాతం రాష్ట్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ఇస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.