Srikalahasti Tada National Highway: తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి-తడ రోడ్డుకు మహర్దశ రానుంది! దీనిని ఆరు లైన్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. శ్రీసిటీకి విమానాశ్రయం నుండి నేరుగా రోడ్డు కనెక్టివిటీ కల్పించాలనే ఆలోచనకు ఇది ఊతమిస్తుంది. కొత్త రోడ్డుతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, భూముల విలువ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఇంతకీ ఈ రోడ్డు నిర్మాణంతో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి!