ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. మొత్తం 9 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, దాదాపు నెల రోజుల కిందట ఒకేసారి 63 మందికి స్థానచలనం కలిగింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికీ కూడా కీలక పోస్టింగులు ఇచ్చింది.