Andhra Pradesh Free Bus Scheme: ఏపీలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అధ్యయనంతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దేశంలో ఈ పథకం అమలు చేస్తున్న ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, వంటి రాష్ట్రాల్లో నిపుణులతో కూడిన అధికారుల బృందం పర్యటించి అధ్యయనం చేయాలని సూచించారు. కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సబ్సిడీ ఇస్తోందని.. రాష్ట్ర వాటా కింద 1,253 బస్సులు వచ్చే అవకాశం ఉందన్నారు.