Andhra Pradesh Govt Rapido: ఏపీ ప్రభుత్వం మహిళల కోసం సరికొత్త నిర్ణయం తసీుకుంది. మహిళా రైడర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. స్వయం సహాయ సంఘాల సభ్యుల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు సమకూరుస్తోంది. వీరిని ర్యాపిడో సంస్థతో అనుసంధానించేలా ఒప్పందం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించి ఈ వాహనాలను అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ కార్యక్రాన్ని ప్రారంభిస్తారు.