Adabidda Nidhi Scheme 2025 Rs 1500: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని ప్రకటించారు. పింఛన్ల పంపిణీ దేశంలోనే అతిపెద్ద కార్యక్రమమని, 64 లక్షల కుటుంబాలకు ప్రతినెలా పింఛను అందిస్తున్నామని తెలిపారు. 'తల్లికి వందనం' కింద పిల్లలకు డబ్బులు జమ చేశామని, దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.