p Govt Give Women Rs 10000 To Rs 2 Lakhs: రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పారిశ్రామికవేత్తలను లక్ష మందికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగా, ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు డెయిరీ, కలంకారి, ఆహార శుద్ధి యూనిట్లు వంటి వాటిని ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. యూనిట్ల విస్తరణకు రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తామని అధికారులు తెలిపారు.