ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే రూ.12 వేల కోట్లు విలువైన ఇంటిగ్రేటెడ్ గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. ఏఎమ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు చేపడుతోంది. కాకినాడలో రూ.12 వేల కోట్లు పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకుంది. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి ఒక మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.