ఏపీలో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. ప్రస్తుతం 26 జిల్లాలు ఉండగా.. కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయి. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి తుది నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రత్యేక రెవెన్యూ డివిజన్లు. మండలాల సరిహద్దుల మార్పులు, చేర్పులను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రేపటి నుంచి (డిసెంబర్ 31) ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.