ఏపీ రైతులకు అలర్ట్.. ఈ క్రాప్ బుకింగ్ గడువు దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 30వ తేదీతో ఈ క్రాప్ బుకింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో రైతులు ఈ క్రాప్ బుకింగ్, ఈ కేవైసీ ప్రక్రియలు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సెప్టెంబర్ 30 నాటిని ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ఆదేశించారు.