అన్నదాతలకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పంట నమోదు సమయంలో టెక్నికల్ కారణాలతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా గతంలో ఈ పంట నమోదుకు ఉపయోగించిన యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ యాప్ స్థానంలో.. కొత్తగా ఈ- పంట డిజిటల్ క్రాప్ సర్వే తీసుకువచ్చింది. దీనిపై మార్గదర్శకాలు జారీ చేసింది.