Andhra Pradesh Farmers E Crop September 15th: ఏపీలో రైతులు సెప్టెంబరు 15వ తేదీలోగా .. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ-పంటలో నమోదు పూర్తి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ తెలిపారు. రైతులకు పంట సాయం, పంట నష్టరిహారం, పంటల బీమా, ఇతరత్రా ప్రభుత్వ పథకాలు అందాలంటే ఈ-పంట నమోదు తప్పనిసరి అన్నారు. దీన్ని బాధ్యతగా తీసుకోవాలని, తూతూమంత్రంగా చేయొద్దని సూచించారు. రైతులు ఒక రకం పంట సాగు చేస్తే, మరో పంటను సాగు చేసినట్లు నమోదు చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. యజమాని, కౌలుదారు అనే విషయాన్ని స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.