Andhra Pradesh Cotton Procurement: ఏపీలో మద్దతు ధరతో సీసీఐ పత్తి కొనుగోలుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. రైతు సేవా కేంద్రాల్లోని వీఏఏల ద్వారా రైతులు పేర్లను రిజిష్టర్ చేయించుకోవాలి. నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. రైతులు పత్తి విక్రయించిన వారంలోనే అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేయనున్నారు. ఈ మేరకు రైతులకు అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు.