ఏపీలోని రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. కాచిగూడ యశ్వంతపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై హిందూపురంలోనూ ఆగనుంది. శనివారం నుంచి హిందూపురంలోనూ ఈ రైలు ఆగనుంది. ఈ మేరకు రైల్వే శాఖ అధికారులు రెండు నిమిషాల పాటు ఆపేందుకు హాల్టింగ్ ఇచ్చారు. స్థానిక ఎంపీ బీకే పార్థసారథి విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హిందూపురంతో పాటుగా అనంతపురం, సత్యసాయి జిల్లాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండనుంది.