Vijayawada Division Trains Cancelled: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఆరు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. నూజివీడు-వట్లూరు-ఏలూరు మధ్య నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఈ రైళ్లు రద్దు, దారి మళ్లింపు ఉంటుందన్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.