Visakhapatnam Hazrat Nizamuddin Samatha Express 12807 Cancelled: విశాఖపట్నం రైల్వే ప్రయాణికులకు అలర్ట్! నాగపూర్ డివిజన్‌లో ట్రాక్ పనుల కారణంగా విశాఖ-నిజాముద్దీన్ సమత ఎక్స్‌ప్రెస్ రైలును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం-తిరుపతి, కర్నూలు, బెంగళూరు మధ్య 42 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుండి మే నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి.