ఏపీలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా వినుకొండలో లెదర్ పార్క్ ఏర్పాటు ప్రక్రియలో వేగం పుంజుకుంది. థాయిలాండ్ కంపెనీ ప్రైమ్ ఏసియా సంస్థ ప్రతినిధులు.. గురువారం వినుకొండ మండలం వెంకుపాలెంలో పర్యటించారు. వెంకుపాలెంలో లెదర్ పార్కు ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. లెదర్ పార్కు ఏర్పాటు కోసం వెంకుపాలెంలో 98 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ 2026లోగా లెదర్ పార్కు నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రైమ్ ఏసియా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.