Andhra Pradesh Flood Victims Relief Fund Release: ఏపీలో వరద బాధితులకు పరిహారం పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితుల బ్యాంక్ ఖాతాల్లో రూ.588 కోట్లు జమ చేసినట్లు అధికారులు వివరించారు. 22,185 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ లేకపోవడంతో వరద సాయం జమ కాలేదన్నారు. లబ్ధిదారుల కేవైసీ పూర్తి కాగానే రెండు,మూడు రోజుల్లో అకౌంట్‌లలో డబ్బులు జమ అవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేస్తున్న వారికి అర్హత ఉంటే ప్రభుత్వ సాయం అందిస్తామంటున్నారు అధికారులు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే తక్షణం పరిష్కరించి డబ్బులు అకౌంట్‌లలోకి జమ చేస్తామంటున్నారు.